Chintoor: చింతూరులో పోలీసుల ఎదుట ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు!

Chintoor: పోలవరం జిల్లా చింతూరులో ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ఎదుట ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 26 Aug 2026 5:49 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో పోలీసుల ఎదుట ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు!

చింతూరు: పోలవరంజిల్లా చింతూరులో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్ పంకజ్ కుమార్ మీనా ఎదుట ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను మీడియా సమావేశంలో పంకజ్ కుమార్ మీనా వెల్లడించారు. ముచ్చకి మంగి,కడితి లక్ష్మయ్య, కడితి ఎంక అను మావోయిస్టులు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి లొంగిపోయినట్లు ఆయన తెలిపారు.

ముచ్చకి మంగి మావోయిస్టు పార్టీ ప్లాటూను కమిటీ సభ్యురాలుగా పనిచేస్తుందని అన్నారు. అలాగే పలు విధ్వంసకర ఘటనలలో పాల్గొన్నట్లు తెలిపారు. కడితి లక్ష్మయ్య, కడితి ఎంక లు మావోయిస్టు పార్టీలో పలు హింసాత్మాక ఘటనలలో పాల్గొన్నారు అని పేర్కొన్నారు.

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని ఆయన తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పంకజ్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సెకండ్ ఇంచార్జ్ ఏకే దీప, సిఐ గోపాలకృష్ణ,ఎస్సై సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story