Kukkunuru: కుక్కునూరు శ్లోక స్కూల్లో ఉత్సాహభరితంగా టీచర్స్ డే!
Kukkunuru: కుక్కునూరు శ్లోక స్కూల్లో ఉత్సాహంగా ఉపాధ్యాయ దినోత్సవం.. ఉపాధ్యాయులుగా మారి విద్యార్థుల బోధన, ఉపాధ్యాయులకు సన్మానం.
Kukkunuru: కుక్కునూరు శ్లోక స్కూల్లో ఉత్సాహభరితంగా టీచర్స్ డే!
Kukkunuru: మండల కేంద్రంలోని శ్లోక స్కూల్లో శనివారం టీచర్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో పాఠాలు బోధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉపాధ్యాయులకు ఆటపాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. స్కూల్ కరస్పాండెంట్స్ మాదినేని శ్రీనివాస్, సుజాత, మనోజ్, రమ్య ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story




