Eluru: జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో సీతానగరం విద్యార్థికి స్వర్ణ పతకం!
Eluru: జిల్లా స్థాయి అండర్-20 అథ్లెటిక్స్‌లో సీతానగరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి జి. స్టీవెన్సన్ గోల్డ్ మెడల్ కైవసం. జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యమని వెల్లడి.. హెచ్ఎం అభినందన.
Eluru: జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో సీతానగరం విద్యార్థికి స్వర్ణ పతకం!
ఏలూరు: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సీతానగరం జడ్పీ హైస్కూల్ విద్యార్థి వివరాలు ఇలా ఉన్నాయి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న జి. స్టీవెన్సన్ ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సెప్టెంబర్ 10న. జరిగిన అండర్ 20 అథ్లెటిక్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.
ఇది జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కు శుభ పరిణామమని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జాతీయస్థాయిలో పథకాలు సాధించటం జీవిత ధ్యేయమని క్రీడాకారుడు స్టీవెన్సన్ తెలిపారు. పాఠశాలకు గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని ప్రధానోపాధ్యాయిని డి.శ్రీలత,తోటి ఉపాధ్యాయులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.ఈ విజయం తమ పాఠశాల పేరును జిల్లా స్థాయిలో ఇనుమడింప చేస్తుందని శ్రీలత అభిప్రాయం వ్యక్తం చేశారు.




