Kukkunur: కుక్కునూరు పీహెచ్‌సీలో సచివాలయ ఏఎన్‌ఎంల నిరసన!
Kukkunur: ఉద్యోగాల క్రమబద్ధీకరణ, 100% గ్రాస్ శాలరీ డిమాండ్‌తో కుక్కునూరు పీహెచ్‌సీలో నల్ల బ్యాడ్జీలతో సచివాలయ ఏఎన్‌ఎంల నిరసన. 30 రోజులు ఆన్‌లైన్ పనులు బంద్.
Kukkunur: కుక్కునూరు పీహెచ్‌సీలో సచివాలయ ఏఎన్‌ఎంల నిరసన!
Kukkunur: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ సాలరీ డిమాండ్లకు మద్దతుగా కుక్కునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సచివాలయ ఏఎన్‌ఎంలు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన తెలిపారు. ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
సెప్టెంబర్ 3న విజయవాడ సచివాలయంలో జేఏసీ నాయకులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్చించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని నెల రోజుల గడువు కోరినట్లు సంఘం సభ్యులు కె. ముత్యాలమ్మ, పి. నాగరాజు తెలిపారు. నిర్ణయం వెలువడే వరకు ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్‌సీల్లో 30 రోజుల పాటు ఆన్‌లైన్ పనులను నిలిపివేసి, శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టి. భూలక్ష్మి, పి. కృష్ణవేణి, ఎం. సీత, పి. ఉషారాణి, కె. సుశీల, నాగమణి, రమణ, మాధవి తదితరులు పాల్గొన్నారు.




