Chintoor: లాంచీలు ఏర్పాటు చేయని అధికారులు: జలదిగ్బంధంలో చింతూరు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి నదులు ఉగ్రరూపం దాల్చాయి.
Chintoor: లాంచీలు ఏర్పాటు చేయని అధికారులు: జలదిగ్బంధంలో చింతూరు!
Chintoor: పోలవరంజిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి,శబరి నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చింతూరులో వరదలను ఎదుర్కొనేందుకు లాంచీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి ఏటా వరదల సమయంలో చింతూరులో అధికారులు లాంచీలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం వరదలు సంభవించిన ఇంకా లాంచీల జాడ కానరావడం లేదు.
చింతూరు వద్ద శబరి ఉప్పొంగి ప్రవహిస్తు శబరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల్లోని ప్రజలకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే వారు చింతూరు రావడానికి లాంచీలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం వరద ఉధృతంగా ఉన్నప్పటికీ లాంచీలు మాత్రం చింతూరులో ఏర్పాటు చేయలేదు.
వరద ఉధృతి మరింతగా పెరిగితే లోతట్టు ప్రాంత ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. వరదల సమయంలో అధికారులు ఇంకా లాంచీలు ఏర్పాటు చేయకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.




