Rampachodavaram: రామకృష్ణ మిషన్ ఉచిత వైద్య శిబిరం – 350 మందికి సేవలు!

Rampachodavaram: రంపచోడవరం సిరిగిందలపాడులో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. 350 మందికి పరీక్షలు, మందులు పంపిణీ మరియు కంటి ఆపరేషన్లకు ఎంపిక.

Prasanna, Rampachodavaram
Published on: 9 Aug 2026 5:20 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: రామకృష్ణ మిషన్ ఉచిత వైద్య శిబిరం – 350 మందికి సేవలు!

Rampachodavaram: రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రీ వారి అధ్వర్యంలో లో స్థానిక, సిరిగిందలపాడు లో రామకృష్ణ మిషన్ వద్ద ఆదివారం ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలియచేసినారు.

ఈ వైద్య శిబిరంలో డాక్టర్ దాసరి ఉమా మహేష్ గారు, డాక్టర్ మహమూద్ ఫాతిమా , డాక్టర్ పావని ప్రియ గారు, డాక్టర్ వెలమ స్నేహా మాధురి పాల్గొని సుమారు 350 మందికి వైద్యసేవలు అందించారు. అవసరం అయిన వారికి 83 మందికి రక్త నీరుడు పరీక్షలు, ఇద్దరికి, ఇ. సి. జి. లు,14 మందికి కి థైరాయిడ్ పరీక్షలు, 17 మందికి, ఫిజియథెరపీ లు చేసినట్లు స్వామీజి తెలియచేసినరు . పరమహంస యోగానంద నేత్రాలయం వేమగిరి,వారిచే సుమారు 70మందికి కంటి పరీక్షలు నిర్వహించి 26 మందికి కళ్ళజోళ్ళు,మరియు 11 మందిని కంటి ఆపరేషన్ లు నిమిత్తం వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం కి తరలించారు.

ఈ వైద్య శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీమతి పి. సీతామహాలక్ష్మి పాల్గొన్నా ఈ వైద్య శిబిరం లో, రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్ మరియు సిబ్బంది వాలంటీర్ గిరిరాజ్ కృష్ణ ,అప్పారావు పాల్గొన్నారు. రోగులు సహాయకులకు అన్నదానం నిర్వహించి నట్లు స్వామిజీ తెలియచేసినారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story