Rampachodavaram: రంపచోడవరంలో రామకృష్ణ మిషన్ ఉచిత వైద్య శిబిరం!

Rampachodavaram: రంపచోడవరం పరిధిలోని సిరిగిందలపాడులో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

Prasanna, Rampachodavaram
Published on: 6 Sept 2026 7:21 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోడవరంలో రామకృష్ణ మిషన్ ఉచిత వైద్య శిబిరం!

రంపచోడవరం: రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రీ వారి అధ్వర్యంలో రంపచోడవరం, సిరిగిందలపాడు లో ఆదివారం వైద్య శిభిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలియచేసినారు. ఈ వైద్య శిభిరం లో సుమారు 165 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తేలియచేసినారు.

ఈ వైద్య శిభిరంలో డాక్టర్ దాసరి ఉమా మహేష్ ,డాక్టర్ శ్రీనివాస్ రాయుడు , డాక్టర్ అమల్దాసు రాజా సుమారు 165 మందికి వైద్య సేవలు. అందించారు. ఈ వైద్య శిభిరం లో పాల్గొన్నరోగులకు 78 మందికి రక్తపరీక్షలు, 13 మందికి కి థైరాయిడ్ పరీ క్షలు , 1 కీ ECG, 12 మందికి physiotherapy చేసినట్లు స్వామీజి తెలిపినారు. రోగులకు, సహాయకులు కు అన్నదానం నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రామక్రిష్ణ మిషన్ సిబ్బంది , వైద్యసేవల సమన్వయ కర్త కానుమోను శ్రీనివాస్ , రామకృష్ణ మిషన్ సిబ్బంది వాలంటీర్ గిరిరాజ్ కృష్ణ పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story