Polavaram: ఇన్‌చార్జ్ ఎంపీడీవోపై అవినీతి ఆరోపణలు - ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి

Polavaram: పోలవరం మండలంలో సర్వసభ్య సమావేశాలు పెట్టకుండా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఇన్‌చార్జ్ ఎంపీడీవోపై ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 11 Sept 2026 11:08 PM IST
Polavaram
X

Polavaram: ఇన్‌చార్జ్ ఎంపీడీవోపై అవినీతి ఆరోపణలు - ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి

పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం మండలంలో గత రెండు సంవత్సరాలుగా పోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాలు పెట్టకుండా రోజులు ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీనివాస్ దాటు వేస్తున్నారని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి అన్నారు.

శుక్రవారం ఎంపీపీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్వసభ్య రికార్డులలో జరగవలసిన పనులు ఆమోదించి , నాకు తెలియకుండా తీర్మానాలు ఇచ్చి బినామీ కాంట్రాక్టర్లతో కోట్లాది రూపాయలు పనులు చేయించాడని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 15 పంచాయతీలలో పనిముట్లకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినట్లుగా చెబుతున్నారని తెలిపారు.

కనీసం మండల కార్యాలయంలో రికార్డులు సరిగ్గా లేవని వాటిని ఎప్పుడు చూపించమన్నా మాట దాటివేస్తున్నట్లుగా చెప్పారు. ఈ అధికారికి గత ప్రభుత్వం నాయకులు, ఈ ప్రభుత్వం నాయకులు, జిల్లా అధికారుల అండదండలు ఉన్నాయని తెలిపారు. గత సుమారు 6 సంవత్సరాలుగా పోలవరం మండలంలోని స్థానిక ఏవో,గా ఇన్చార్జ్ ఎంపీడీవో గా కార్యాలయంలో చక్రం తిప్పుతున్నట్లుగా చెప్పారు.

ఈ మధ్యకాలంలో ఇద్దరు ఎంపీడీవోలు వచ్చిన వారు ఒక సంవత్సరంలోపే తిరిగి వెళ్లేలా వారికి నరకం చూపించాడని అన్నారు. మండల కార్యాలయంలో ఏసీబీ అధికారులతో ఎంక్వయిరీ చేయిస్తే కోట్లాది రూపాయల అవినీతి సొమ్ము బయట పడుతుందని అన్నారు. ప్రభుత్వ సొమ్మును కాపాడాలని ఉన్నతాధికారులను కోరారు.

రెండు సంవత్సరాలు సమావేశాలు పెట్టకుండా పనులు ఆమోదం లేకుండా, తీర్మానాలు లేకుండా బినామీ కాంట్రాక్టర్లతో పనులు చేయించినట్లుగా రికార్డులలో చూపించి ఈ ఇన్చార్జ్ ఎంపీడీవో కోట్లాది రూపాయలు అవినీతికి పాడ్పడినట్లుగా తెలిపారు. ఈ విషయంపై ఎంపీడీవో జి మణి కుమారిని వివరణ కోరగా గత 20 రోజుల కిందట పోలవరం బదిలీపై వచ్చానని అప్పటినుండి ఎన్నిసార్లు రికార్డులు అడిగినా ఇవ్వలేదని చెప్పారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM