Eluru: వేలేరుపాడు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటన!

Eluru: వేలేరుపాడు ముంపు ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటన! జేసీ అభిషేక్, ఎస్పీ ప్రశాంత్‌లతో సమీక్షించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 1 Aug 2026 12:20 PM IST
Eluru
X

Eluru: వేలేరుపాడు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటన!

జిల్లా : ఏలూరు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే విస్తృత పర్యటన..

సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలు వరద ముంపునకు గురికావడంతో శనివారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

మొదటగా జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్‌తో కలిసి వేలేరుపాడు ఎమ్మార్వో కార్యాలయంలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సహాయక శిబిరాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నిత్యావసర వస్తువులు, తాగునీరు, ఆహార పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, అవసరమైన ప్రతి సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేలేరుపాడు మండల టీడీపీ అధ్యక్షుడు అమరవరపు అశోక్, మేచినేని సంజయ్, శివరాం, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story