Kukunoor: మీ వెనుక నేనున్నా జాతీయ వాలీబాల్ క్రీడాకారులకు ఎమ్మెల్యే భరోసా!
Kukunoor: ఏలూరు జిల్లా మల్లారం వాలీబాల్ జట్టు జాతీయ స్థాయికి ఎంపిక. క్రీడాకారులకు రూ. 20 వేల ఆర్థిక సాయం, కిట్లు అందజేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
Kukunoor: మీ వెనుక నేనున్నా జాతీయ వాలీబాల్ క్రీడాకారులకు ఎమ్మెల్యే భరోసా!
Kukunoor: వేలేరుపాడు మండలం పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన యువ వాలీబాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో మల్లారం యువత ప్రథమ స్థానం సాధించి, సెప్టెంబర్ 6న కోయంబత్తూరులో జరగనున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా వేలేరుపాడు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్ ఆధ్వర్యంలో మల్లారం వాలీబాల్ క్రీడాకారులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఎమ్మెల్యే బాలరాజు అభినందించారు.
మన నియోజకవర్గానికి, మన జిల్లాకు, ముఖ్యంగా మన రాష్ట్రానికి క్రీడల ద్వారా మంచి పేరు తీసుకురావాలి. "మీ వెనుక నేను ఉన్నాను.. విజయానికి అవసరమైన ప్రోత్సాహం అందిస్తాను" అంటూ క్రీడాకారులకు ఎమ్మెల్యే ధైర్యం కల్పించారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో రూ.20 వేల నగదు, రెండు వాలీబాల్ కిట్లను అందజేశారు.
జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరెన్నో విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన మల్లారం క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు.
అనంతరం క్రీడాకారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తమను ఎంతో ఆప్యాయంగా ఆదరించి, క్రీడాకారుల పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే సమయంలో ఆర్థిక సహాయంతో పాటు క్రీడా సామగ్రిని అందించి ప్రోత్సహించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని జాతీయ స్థాయిలో విజయం సాధించి మల్లారం గ్రామానికి, వేలేరుపాడు మండలానికి, ఏలూరు జిల్లాకు మంచి పేరు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిర్రీ దేవరాజు, శివరామ్, చంటి, భాను, వంశీ, ప్రవీణ్, నాగు తదితరులు పాల్గొన్నారు.




