Polavaram: అడవి మార్గాల గుండా గంజాయి స్మగ్లింగ్

Polavaram: పోలవరం జిల్లా గుర్తేడు మండలం కొత్తూరు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.3.50 లక్షల విలువైన 7 కిలోల డ్రై గంజాయి పట్టుబడింది.

PRASANNA, RAMACHANDRAPURAM
Published on: 29 Jun 2026 3:14 PM IST
Polavaram
X

Polavaram: అడవి మార్గాల గుండా గంజాయి స్మగ్లింగ్

Polavaram: పోలవరం జిల్లా గుర్తేడు మండలం కొత్తూరు గ్రామ సమీపంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.3.50 లక్షల విలువచేసే 7 కిలోల డ్రై గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజనాల కోటిరెడ్డి అనే వ్యక్తి దారకొండ ప్రాంతం నుంచి అనుమానం రాకుండా అడవి మార్గాల గుండా కాలినడకన ప్రయాణిస్తూ మారేడుమిల్లి వైపు గంజాయిని తరలిస్తుండగా, ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు కొత్తూరు సమీపంలో తనిఖీలు నిర్వహించి అతడిని పట్టుకున్నారు.

అతడి వద్ద ఉన్న 7 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని విచారించి గంజాయి ఎక్కడి నుంచి సేకరించాడు, ఎవరికి సరఫరా చేయడానికి తీసుకెళ్తున్నాడు, ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు పేర్కొంటూ, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PRASANNA, RAMACHANDRAPURAM

PRASANNA, RAMACHANDRAPURAM

Next Story