Nuzvid: మీర్జాపురంలో వీఆర్వో సంతకం ఫోర్జరీ: పోలీసులకు ఫిర్యాదు

Nuzvid: మీర్జాపురం వీఆర్వో కేశవరావు సంతకాన్ని ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రం సృష్టించిన వ్యవహారంపై నూజివీడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 2:12 PM IST
Nuzvid
X

Nuzvid: మీర్జాపురంలో వీఆర్వో సంతకం ఫోర్జరీ: పోలీసులకు ఫిర్యాదు

Nuzvid: వీఆర్వో సంతకం ఫోర్జరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విఆర్ఓ కేశవరావు,గతంలో కూడా సెక్రటరీ సంతకాలు ఫోర్జరీ చేసి డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గొడవలు కూడా జరిగాయి ప్రస్తుతం వివరాలు ఇలా ఉన్నాయి.

ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి సంబంధించి ఒక ధృవీకరణ పత్రం ఫోర్జరీ అయినట్లు వీఆర్వో తన దృష్టికి తీసుకువచ్చారని నూజివీడు తహసీల్దార్ షేక్ సంసుద్ధిన్ తెలిపారు.

బ్యాంకు అధికారులకు సమర్పించిన ఒక ధృవీకరణ పత్రంపై అనుమానం రావడంతో, ఆ ధృవీకరణ పత్రాన్ని వీఆర్వో జారీ చేశారా లేదా అని బ్యాంకు అధికారులు వీఆర్వోను సంప్రదించి వివరాలు కోరినట్లు తెలిపారు. పత్రాన్ని పరిశీలించిన వీఆర్వో,తాను ఆ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయలేదని స్పష్టం చేయడంతో పాటు,అందులో ఉన్న తన సంతకం కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారని చెప్పారు.

వెంటనే వీఆర్వో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు నూజివీడు తహసీల్దార్ తెలిపారు. ఈ విషయాన్ని తాను కూడా సంబంధిత రూరల్ ఎస్‌ఐతో ఫోన్‌లో మాట్లాడి, వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి,సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నూజివీడు తహసీల్దార్ స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్