Etapaka: గొల్లగుప్పలో గిరిజన బాలిక మృతి ఘటనపై ఎంపీ తనుజారాణి పరామర్శ

Etapaka: ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మాత్రల అస్వస్థత ఘటనపై ఎంపీ తనుజారాణి పర్యటన. లక్ష్మీపురం పీహెచ్‌సీకి అంబులెన్స్ మంజూరు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 12 Sept 2026 4:54 PM IST
Etapaka
X

Etapaka: గొల్లగుప్పలో గిరిజన బాలిక మృతి ఘటనపై ఎంపీ తనుజారాణి పరామర్శ

ఎటపాక: పోలవరంజిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో ఇటీవల మలేరియా మాత్రలు మింగి ఓ గిరిజన బాలిక మడివి జమున(7),మరియు 53 మంది అస్వస్థకు గురైన సంఘటన తెలిసిందే.శనివారం అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనుజారాణి మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న గొల్లగుప్ప గ్రామాన్ని కాలినడకన వెళ్లడం జరిగింది.

మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.అస్వస్థతకు గురై కోలుకున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎంపీ తనుజారాణి అడిగి తెలుసుకున్నారు. మలేరియా మాత్రలు వికటించి ఓ బాలిక మృతి చెండటం చాలా బాధాకరమని అన్నారు.

మలేరియా నివారణ మాత్రలు ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు పాటించి ఉంటే ఈ అనర్ధం జరిగి ఉండేది కాదని ఎంపీ తనుజారాణి అన్నారు.53 మంది అస్వస్థతకు గురై కోల్పోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గొల్లగుప్ప గ్రామస్తులను ఆరోగ్యం పై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

లక్ష్మీపురం పి హెచ్ సి పరిధిలోని మారుమూల గ్రామాలలో నివసిస్తున్న ఆదివాసీలు అనారోగ్యానికి గురైతే సరైన సమయంలో వైద్యశాలకు చేరకపోవడంతో మృత్యువాత పడుతున్నారు.ఈ విషయం గుర్తించిన ఎంపీ తనుజారాణి ఎంపీ నిధుల నుంచి లక్ష్మీపురం పి హెచ్ సి కి అంబులెన్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.ఈ పర్యటనలో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎటపాక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR