Bheemadole: గురుపూజోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
Bheemadole: భీమడోలు ఎంఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం. గురుపూజోత్సవంలో పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు.
Bheemadole: గురుపూజోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
భీమడోలు: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమడోలులో మండల విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి పౌరులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. సుసంస్కృత సమాజ నిర్మాణానికి గురువులు వేసే పునాదే ప్రధానమని ఎమ్మెల్యే ధర్మరాజు గారు పేర్కొన్నారు.
గొప్ప విద్యావేత్త, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం ప్రతి ఉపాధ్యాయునికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. విద్య ద్వారా వ్యక్తిలో విజ్ఞానంతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, బాధ్యత పెంపొందుతాయని, ఈ విలువలను విద్యార్థులకు అందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, మండల మరియు గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.




