Eluru: బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులు: పోలవరం బాధితురాలి ఆవేదన!
Eluru: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామం కొండ్రుకోటకు చెందిన చిన్నంశెట్టి సుజాత బ్రతికుండగానే రికార్డుల్లో చనిపోయినట్లు అధికారులు నమోదు చేశారు.
Eluru: బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులు: పోలవరం బాధితురాలి ఆవేదన!
ఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్ట్ పురావస గ్రామమైన కోండ్రుకోట గ్రామానికి చెందిన చిన్నంశెట్టి సుజాత నీ గత మూడు సంవత్సరాల కిందట వాలంటీర్లు చేసిన చిన్న పనికి రెవిన్యూ రికార్డులలో తాను చనిపోయినట్లు చూపిస్తున్న సంఘటన చోటుచేసుకుంది.
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయి పునరావాస గ్రామంలో మేము బ్రతుకున్నా లేనట్లుగా రెవెన్యూ రికార్డులలో చనిపోయినట్లుగా చూపించడం మేము చేసుకున్న పాపమా... లేక శాపమా ఏమీ అర్థం అవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ పేద చిరు వ్యాపారి.
అవును ఇది నిజం...
ఆధార్ కార్డ్ లో సుజాత చనిపోయిందంటూ గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన పనికి ఆమెకు ప్రభుత్వం నుండి ఎటువంటి పరిహారం కూడా అందడం లేదు. ప్రధానంగా ఈ చిన్న తప్పు వల్ల రేషన్ కార్డు కూడా రాలేదని చెబుతుంది. ఇదే విషయాన్ని అధికారులకు చెప్పడానికి గత మూడు సంవత్సరాలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని కానీ వారు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
పోలవరంలో ఆర్ అండ్ బి రోడ్డు పక్కన తన బ్రతుకుతెరువు కోసం చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ రోజుకు 500 రూపాయలు సంపాదించుకుంటున్నానని, మంచం మీదే ఉంటున్న నా తల్లిని, ఆ డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని చెబుతుంది.
అలాంటి నాకు హౌసింగ్ ప్లాన్ లో మీ పేరు లేదు, ఆధార్ కార్డులో నువ్వు చనిపోయావని వస్తుందని అందుకే రేషన్ కార్డు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన కుమారుడికి కూడా రేషన్ కార్డు లేకపోవడంతో అమ్మవడి కూడా రాలేదని చెబుతుంది.
ఇదే విషయాన్ని పదేపదే రెవెన్యూ అధికారులకు చెప్పినప్పటికీ మేము మీ కాగితాలు జిల్లా కార్యాలయానికి పంపించామని, అక్కడ ఆధార్ కార్డులో నువ్వు బ్రతికే ఉన్నావని నిర్ధారణ చేశాక నీకు రేషన్ కార్డు ఇస్తామని చెబుతున్నట్లు చెప్పింది. అధికారులు చేసిన తప్పులకు మేము బలి అవ్వాలా ఇలా అయితే నాలాంటివారు ఎలా బ్రతకాలి అంటూ అధికారులను ప్రశ్నిస్తుంది.
ఇప్పటికైనా నేను బ్రతికున్నట్లుగా గుర్తించి నాకు న్యాయం చేయాలని కలెక్టర్ అమ్మను కోరుకుంటుంది. అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయి అంది అందని పరిహారాలతో జీవితాన్ని గడుపుతున్న వీళ్ళకి అధికారుల రూపంలో శాపం ఎదురవడం తాము చేయని తప్పుకు శిక్ష అనుభవించడం తమ పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.




