Yetapaka: కన్నాయిగూడెం వద్ద కూటమి నేతల రోడ్డు రోకో.. ఇసుక లారీల అడ్డగింపు!

Yetapaka: చింతూరు పరిధిలోని కన్నాయిగూడెం-భద్రాచలం ఆర్ అండ్ బీ రహదారిపై కూటమి నేతలు ధర్నా చేపట్టారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 16 Sept 2026 5:27 PM IST
Yetapaka
X

Yetapaka: కన్నాయిగూడెం వద్ద కూటమి నేతల రోడ్డు రోకో.. ఇసుక లారీల అడ్డగింపు!

ఎటపాక: గుంతలమయంగా తయారై మృత్యుకుహరంగా మారిన కన్నాయిగూడెం టు భద్రాచలం రహదారిని నూతనంగా నిర్మించాలంటూ కూటమి నాయకులు రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ రహదారి పై వరుస ప్రమాదాలతో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నూతన రహదారిని నిర్మించాలంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందించకపోవడంతో కూటమి నాయకులు ఆగ్రహించి బుధవారం కన్నాయిగూడెం వద్ద రోడ్డు పై బైఠాయించారు.తెలంగాణ ప్రాంతం నుండి ఇసుక లారీలు నిత్యం పదుల సంఖ్యలో ఈ రహదారి పై తిరగడంతో రహదారి పెద్ద పెద్ద గుంతల మయంగా తయారైందని అన్నారు.

తెలంగాణ ప్రాంతం నుండి వస్తున్న ఇసుక లారీలను కూటమి నాయకులు ఆపివేయడం జరిగింది.ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమంటూ రహదారి పై బైఠాయించి నినాదాలు చేశారు.రహదారి పై ధర్నా విషయాన్ని తెలుసుకున్న ఐటీడీఏ అధికారి శుభం నొక్వాల్ నూతన రహదారి పనులకు రూ.3.48 కోట్లు మంజూరు చేస్తామని అన్నారు.

వారం రోజుల్లో రహదారి పనులు ప్రారంభిస్తామని తెలపడం జరిగింది.రహదారి పై ఉన్న గుంతలను పూడ్చేందుకు టిడిపి రాష్ట్ర నాయకులు మువ్వ శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో మెటీరియల్ తెప్పించి రహదారికి మరమ్మత్తులు చేపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎటపాక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు,జనసేన మండలాధ్యక్షుడు మారాసు గంగాధర్,బిజెపి యువమోర్చా జిల్లా అధ్యక్షులు మూడే సతీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR