Kukunoor: ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన
Kukunoor: కుక్కునూరు రైతు సేవా కేంద్రంలో ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై అవగాహన సదస్సు. పాల్గొన్న ఇఫ్కో అధికారులు, రైతులు.
Kukunoor: ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన
కుక్కునూరు: ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కుక్కునూరు మన రైతు సేవ కేంద్రంలో రైతుల సదస్సు నిర్వహించారు.
ఏలూరు జిల్లా ఇఫ్కో అధికారి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో, కేంద్రం ప్రొప్రైటర్ వేల్పుల వెంకన్న బాబు సమక్షంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నానో ఎరువులు, జీవ ఎరువులు, సాగరిక, బోరాన్, నేచురల్ పొటాష్ తదితర ఎరువుల వినియోగ విధానం, పంటలకు కలిగే ప్రయోజనాలు, సరైన మోతాదుపై రైతులకు శిక్షణ ఇచ్చారు.
భూసార పరిరక్షణతో పాటు పంటల ఉత్పాదకత, నాణ్యతను మెరుగుపరచేందుకు ప్రత్యామ్నాయ ఎరువులను పంట అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.




