Kukunoor: ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి ఏఐటీయూసీ కన్వీనర్

Kukunoor: ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి సబ్సిడీ రుణాలు అందించి ఆదుకోవాలని ఏఐటీయూసీ కుక్కునూరు కన్వీనర్ డిమాండ్.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 11 Aug 2026 7:54 PM IST
Kukunoor
X

Kukunoor: ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి ఏఐటీయూసీ కన్వీనర్

కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఏ ఐటీయూసీ కుక్కునూరు మండల కన్వీనర్ కొన్నె.లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏఐటీయూసీ అనుబంధ సంఘం స్థానిక భగత్ సింగ్ ఆటో యూనియన్ సభ్యులు అధ్యర్యంలో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆయనన్నారు.

డ్రైవర్ల కు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి సబ్సిడీ పై వాహన రుణాలు కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో ముదిగొండ. ఖాదర్, సూర్య, రాయి. బాలాజీ, వరకా. శ్రీను, సుధీర్, వలీ,కురాకుల. బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story