Velerupadu: గుంతలమయంగా కన్నాయిగుట్ట–కోయిదా రహదారి.. వాహనదారులకు నరకప్రాయం!

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో కన్నాయిగుట్ట-కోయిదా రోడ్డు అధ్వానంగా మారింది. ద్విచక్ర వాహనదారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 12 Sept 2026 1:52 PM IST
Velerupadu
X

Velerupadu: గుంతలమయంగా కన్నాయిగుట్ట–కోయిదా రహదారి.. వాహనదారులకు నరకప్రాయం!

Velerupadu: మండల పరిధిలోని కన్నాయిగుట్ట నుంచి కోయిదా వరకు రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్కూరు నుంచి టేకూరు వంతెన వరకు రహదారి కొంతమేర బాగున్నా, అక్కడి నుంచి కోయిదా వరకు పెద్ద గుంతలు, కొట్టుకుపోయిన రోడ్లతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు.

వర్షపు నీరు గుంతల్లో నిలిచిపోవడంతో వాటి లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ద్విచక్ర వాహనాల ప్రయాణం కష్టంగా ఉందని చెబుతున్నారు. అంబులెన్సుల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టేకుపల్లి, పేరంటాలపల్లి, కాకిసునూరు గ్రామాల ప్రజలు రోడ్డు ప్రయాణం కంటే పడవ ప్రయాణమే మేలని అంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు నిత్యం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే రహదారిని పరిశీలించి గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR