Chintoor: చింతూరులో విషాదం: సోకిలేరు వాగులో హెచ్‌సీఎల్ టెక్కీ మృతి!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం సోకిలేరు వాగులో హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సీఎల్ ఉద్యోగి నీలేష్ కుమార్ కొట్టుకుపోయి మృతి చెందాడు.
Chintoor: చింతూరులో విషాదం: సోకిలేరు వాగులో హెచ్‌సీఎల్ టెక్కీ మృతి!
చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద గల ప్రకృతి అందాలను చూడటానికి హైదరాబాద్ నుంచి ఆరుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వచ్చారు. వ్యూ పాయింట్ వద్ద గల సోకిలేరు వాగులో ముగ్గురు అమ్మాయిలు,ముగ్గురు అబ్బాయిలు స్నానానికి దిగారు.
ఈ సమయంలో వాగు ఉదృతంగా ప్రవహించడంతో ఆరుగురు వాగులో కొట్టుకుపోసాగారు.రవి హేమంత్,కోమల ఐశ్వర్య లు సమీపంలోని వాగులోని పెద్ద బండరాయిని పట్టుకొని గట్టెక్కారు.మహమ్మద్ ఇమ్రాన్,కోమల ధరణి, గీల సింధుజా వాగులో కొట్టుకుపోతూ వాగు మధ్యలో ఓ బండరాయిని పట్టుకొని ఆగిపోయారు.
కొంత సమయం తర్వాత సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీస్ సిబ్బంది వాగు వద్దకు చేరుకొని వాగు మధ్యలో బండరాయిని పట్టుకొని ఉన్న ముగ్గురుని వాగు బయటకి తీసుకురావడం జరిగింది.ఇది ఇలా ఉండగా కోసూరు నీలేష్ కుమార్ (25) వాగులో గల్లంతయ్యాడు.
నీలేష్ కుమార్ ఆచూకీ కోసం చింతూరు సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్సై హుస్సేన్ లు పోల్లూరు గ్రామం నుండి గజ ఈతగాలను తెప్పించి వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో లోతైన ప్రదేశం వద్ద నీలేష్ కుమార్ మృతదేహం లభ్యం అయ్యింది. తమతో పాటు వచ్చిన స్నేహితుడు మృత్యువాత పడటంతో ఆ స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




