Polavaram: గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. బొలెరో వాహనం స్వాధీనం
Polavaram: పోలవరం జిల్లా వై. రామవరం మండలంలో పోలీసుల మెరుపు దాడులు. 250 కిలోల గంజాయి, బొలెరో వాహనం స్వాధీనం. నలుగురు నిందితుల అరెస్ట్.
Polavaram: గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. బొలెరో వాహనం స్వాధీనం
Polavaram: పోలవరం జిల్లా వై. రామవరం మండలం కొమరవరం గ్రామ సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రంపచోడవరం డీఎస్పీ అష్రఫ్ అలీ వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో యార్లగడ్డ గ్రామ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న మహీంద్రా బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో 10 సంచుల్లో సుమారు 250 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి
250 కిలోల గంజాయి, ఒక మహీంద్రా బొలెరో వాహనం, ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా, కొనుగోలు, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.




