Eluru: వరద బాధితులకు అండగా యంత్రాంగం..బోట్ల ద్వారా నిత్యావసరాల పంపిణీ
Eluru: కుక్కునూరు మండలాల్లో గోదావరి వరద ముంపునకు గురైన గ్రామాల్లో జిల్లా యంత్రాంగం బోట్ల ద్వారా వారం రోజులకు సరిపడా తాగునీరు, నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది.
Eluru: వరద బాధితులకు అండగా యంత్రాంగం..బోట్ల ద్వారా నిత్యావసరాల పంపిణీ
ఏలూరు: ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గోదావరి వరద కారణంగా వరద నీట మునిగి రహదారి మార్గాలు లేని గ్రామాల త్రాగునీరు, కూరగాయలు, నిత్యావసర సరుకులను జిల్లా యంత్రాంగం అందిస్తోంది.
వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలకు గోదావరి వరద నీరు కారణంగా రహదారి వరదనీటిలో మునిగిన కారణంగా ప్రజలు ఆయా గ్రామాలలో చిక్కుకుపోయారు. రెవిన్యూ , పౌర సరఫరాల శాఖల సిబ్బంది బోట్లు , పడవల ద్వారా ఆయా గ్రామాలలోని ప్రజల ఇళ్లవద్దకు వెళ్లి వారం రోజులకు సరిపడా త్రాగునీరు, కూరగాయలు, నిత్యావసర సరుకుల పంపిణీని చేశారు.
Next Story




