Eluru: వేలేరుపాడులో అర్ధరాత్రి దొంగల బీభత్సం గొంతు నులిమి చోరీకి యత్నం!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు సంత బజారులో అర్ధరాత్రి దొంగతనానికి యత్నించిన ఐదుగురు దుండగులు.
Eluru: వేలేరుపాడులో అర్ధరాత్రి దొంగల బీభత్సం గొంతు నులిమి చోరీకి యత్నం!
ఏలూరు: గుర్తు తెలియని దుండగుడు ఓ ఇంట్లో చోరీకి యత్నించిన సంఘటన వేలేరుపాడు మండల కేంద్రంలోని సంత బజారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. భాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలోని సంత బజారులో కారం సీతయ్య, దుర్గమ్మ దంపతులు కూతురు తులసి, కొడుకు కుమారులతో నివాసం ఉంటున్నారు.
ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఐదుగురు దుండగులు ఇంటిలోకి ప్రవేశించారు. ఇంటిలోకి అక్రమంగా చొరబడ్డ దుండగులు దుర్గమ్మ, సీతయ్యల గొంతు నులుముతుంటే దుర్గమ్మ కూతురు తులసి అక్కడికి రావడంతో ఆమెను కూడా గొంతు నులిమెందుకు దుండగులు ప్రయత్నించగా ఆమె వారి నుండి విడిపించుకుని కేకలు వేయడంతో ఆ ఆమె అరుపులకు ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తమ్ముడు కుమార్ మేలుకొని బయటకు పోస్తుండగా దుండగులు గదిలోకి నెట్టి తలుపు గొళ్ళెం పెట్టడంతో తలుపు తీయండి అని కుమార్ గట్టి గట్టిగా కేకలు వేస్తుండగా వారి కేకలకు చుట్టుపక్కల వారు నిద్ర ఇండ్ల నుంచి బయటికి రావడంతో దుండగులు భయపడి ఇంటి వెనుక పొలాల్లోకి పారిపోయారు.
ఈ కంగారులో దుండగులు వెంట తెచ్చుకున్న కత్తి, కర్రలు,తాళ్లు, సంచి,గడ్డ పలుగుతోపాటుగా కాళ్ళ చెప్పులను అక్కడే వదిలి వెళ్ళారు. ఇట్టి విషయంపై బాధితులు వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దొంగలను గుర్తించేందుకు వారు వదిలిపోయిన ఐదు జతల చెప్పులు, గడ్డ పలుగు, కత్తి, తాళ్లు, సంచి, కర్రలను పరిశీలించి, స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




