Eluru: వేలేరుపాడులో ముమ్మరంగా ‘డెంగీ నివారణ మాసోత్సవాలు
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో డెంగీ నివారణ మాసోత్సవాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Eluru: వేలేరుపాడులో ముమ్మరంగా ‘డెంగీ నివారణ మాసోత్సవాలు
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో డెంగీ నివారణ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ జి ప్రవీణ ఆశా జ్యోతి నాయకత్వంలో స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు డెంగీ మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతను పాటించడం నిల్వ నీరు లేకుండా చూడడం దోమల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా డెంగీ మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని విద్యార్థులకు వివరించారు.
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమాన్ని నిర్వహించి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాలానుగుణంగా వచ్చే వ్యాధులు వాటి నివారణ చర్యలపై డాక్టర్ జి ప్రవీణ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకుడు కారం ధారయ్య, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




