Eluru: రుద్రంకోటలో సైబర్ నేరాలపై పోలీసుల కీలక అవగాహన సదస్సు
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోటలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది.
Eluru: రుద్రంకోటలో సైబర్ నేరాలపై పోలీసుల కీలక అవగాహన సదస్సు
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఏలూరు జిల్లా ఎస్‌పి కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు కుకునూరు సీఐ పి. బాలసురేష్ బాబు ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామంలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ మోసాలు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే గోదావరి వరదల సమయంలో అధికారుల సూచనలు పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ పి. నవీన్ కుమార్ తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




