Eluru: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ఏలూరు రేంజ్‌కు 308 పతకాలు!

Eluru: మంగళగిరిలో జరిగిన ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026లో ఏలూరు రేంజ్ 308 పతకాలతో సత్తా చాటింది. విజేతలను అభినందించిన ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, ఎస్పీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Sept 2026 2:06 PM IST
Eluru
X

Eluru: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ఏలూరు రేంజ్‌కు 308 పతకాలు!

Eluru: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరి VIT యూనివర్సిటీలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026లో ఏలూరు రేంజ్ పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 308 పతకాలు సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు.ఏలూరు అమీనా పేటలోని పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో రేంజ్ ఐజీ జి.వి.జి.అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.ప్రసాదరావు పాల్గొని పతక విజేతలను అభినందించారు.

క్రీడాకారులు 119 గోల్డ్, 116 సిల్వర్,73 బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు అధికారులు తెలిపారు. క్రీడలు పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం,మానసిక ఉల్లాసం,క్రమశిక్షణ,ఏకాగ్రత,సమయస్ఫూర్తి,జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఐజీ,ఎస్పీ పేర్కొన్నారు.పోలీస్ విధుల్లోనే కాకుండా క్రీడా రంగంలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఏలూరు రేంజ్‌కు మంచి పేరు తీసుకువచ్చిన క్రీడాకారులను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story