Velerupadu: వేలేరుపాడు ఆసుపత్రిలో పండ్లు పంపిణీ - బాత్రూమ్‌ల నిర్మిత
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ. ఆసుపత్రిలో నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన లాయర్ గంగారాం.
Velerupadu: వేలేరుపాడు ఆసుపత్రిలో పండ్లు పంపిణీ - బాత్రూమ్‌ల నిర్మిత
వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో బడి గంటల రాంబాబు జ్ఞాపకార్థం వారి సోదరుడు లాయర్ గంగారాం ఆధ్వర్యంలో వేలేరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు శనివారం నాడు పలు రకాల పండ్లు, పాలు పంపిణీ చేశారు.
ఆసుపత్రిలో మరుగుదొడ్ల సౌకర్యం లేక రోగులకు మరియు వారి సహాయకులకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లాయర్ గంగారం దృష్టికి తీసుకెళ్లడంతో రోగులకు మరియు వారి సహాయకులకు సౌకర్యార్థం ఆసుపత్రి ఆవరణలో మరుగుదొడ్ల (బాత్రూమ్) నిర్మాణం చేపట్టడం చేపడతానని, మాట ఇవ్వడమే కాకుండా వెంటనే తాపీ మేస్త్రులను పిలిపించి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
సోదరుడి జ్ఞాపకార్థం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడానికి వచ్చిన ఆయనకు రోగులు పడుతున్న అవస్థల గురించి చెప్పగానే విన్న వెంటనే బాత్రూమ్ నిర్మించడానికి ముందుకు రావడం అభినందించదగిన సామాజిక కార్యక్రమం అని, ఇలాంటి సేవలు రోగులకు ఎంతో ఊరటనిస్తాయి మండలంలోని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్, జనసేన కార్యదర్శి మేచినేని సంజయ్, నాయకులు కరుటూరి రాధాకృష్ణ, కుక్కునూరు రాంబాబు,సత్తిపండు, డాక్టర్ సలీం, సురేష్, ముత్యాలరావు, శాఖమూరి సంజీవులు, నూపా శ్రీరాములు, బేతి శ్రీను, కట్టం రాంబాబు, పసుపులేటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.




