Eluru: సాంఘిక సంక్షేమ వసతి గృహం వార్డెన్ను సస్పెండ్ చేసిన కలెక్టర్

Eluru: ఏలూరు జిల్లా చింతలపూడి సాంఘిక సంక్షేమ వసతి గృహం నుండి 8వ తరగతి విద్యార్థినిని రాత్రి బయటకు పంపిన వార్డెన్ స్వప్నను కలెక్టర్ సస్పెండ్ చేశారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 29 Jun 2026 8:46 PM IST
Eluru
X

Eluru: సాంఘిక సంక్షేమ వసతి గృహం వార్డెన్ను సస్పెండ్ చేసిన కలెక్టర్

Eluru: ఏలూరు జిల్లా చింతలపూడిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుండి ఎనిమిదో తరగతి విద్యార్థిని రాత్రి వేళల్లో బయటికి పంపించిన వార్డెన్ స్వప్నను ఏలూరు జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ వై.విశ్వమోహన్ రెడ్డి విలేకరులకు తెలిపారు.

చింతలపూడి లోని సాంఘిక సంక్షేమ వసతి గృహం ను సోషల్ వెల్ఫేర్ డిడి సోమవారం సందర్శించారు.విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థిని ని హాస్టల్లో ఉంచి చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విద్యార్థినిని కొట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్టల్ వాచ్ మెన్ రాణిని కూడా సస్పెండ్ చేస్తామని తెలిపారు.సోషల్ వెల్ఫేర్ డిడి వెంట ఇంచార్జ్ ఏ ఎస్ డబ్ల్యూ ఆర్ వి. శ్రీనివాస్ ఉన్నారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

Next Story