Eluru: చినుకు పడితే చిత్తడే.. పాత పూచిరాల గ్రామస్తుల నరకయాతన!

Eluru: వేలేరుపాడు మండలం పాత పూచిరాల గ్రామంలో మట్టి రోడ్డు కారణంగా 150 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Aug 2026 12:40 PM IST
Eluru
X

Eluru: చినుకు పడితే చిత్తడే.. పాత పూచిరాల గ్రామస్తుల నరకయాతన!

Eluru: వేలేరుపాడు మండలం రేపాకగోమ్ము పంచాయతీ పరిధిలోని పాత పూచిరాల గ్రామంలో రహదారి సమస్యతో సుమారు 150 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి ప్రధాన రహదారిగా ఉన్న రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారడంతో గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

వర్షం కురిసిన సమయంలో రహదారిపై పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడంతో నడిచి వెళ్లడం కూడా కష్టంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉండటంతో అత్యవసర సమయాల్లో కూడా ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు బురద రోడ్డుపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాకాలంలో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో కనీసం రహదారిపై మెటల్ లేదా గ్రావెల్ వేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పాత పూచిరాల గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story