Chintoor: చింతూరు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌ను తనిఖీ చేసిన డీఎం అజయ్ బాబు!

Chintoor: చింతూరు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌ను పరిశీలించిన గోకవరం డీఎం అజయ్ బాబు. మహిళలకు బాత్రూమ్ సదుపాయంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ.

RAJESH REDDY, CHINTOOR
Published on: 15 Sept 2026 12:42 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌ను తనిఖీ చేసిన డీఎం అజయ్ బాబు!

Chintoor: చింతూరులోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ను గోకవరం డిపో మేనేజర్ అజయ్ బాబు మంగళవారం సందర్శించారు.బస్ కాంప్లెక్స్ లోని మౌలిక సదుపాయాల పై అరా తీశారు. ఈ సందర్భంగా అజయ్ బాబు మీడియాతో మాట్లాడారు. బస్సు కాంప్లెక్స్ లో నెలకొని ఉన్న అన్ని సమస్యలను త్వరలో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న బాత్రూమ్స్ సౌకర్యం పై దృష్టి పెట్టి త్వరలో మహిళలకు బాత్రూమ్స్ అందుబాటు లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అలాగే బస్సు కాంప్లెక్స్ పరిశుభ్రత గా ఉండేలా చూస్తామని అన్నారు.

చింతూరు బస్ కాంప్లెక్స్ లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని డిఎం అజయ్ బాబు అన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR