Chintoor: చింతూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన ముంపు బాధితులు!
Chintoor: చింతూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన పోలవరం ముంపు బాధితులు, సీపీఎం నాయకులు. ఆర్&ఆర్ కమిషనర్ ప్రశాంతికి వినతిపత్రం సమర్పణ.
Chintoor: చింతూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన ముంపు బాధితులు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ వద్ద ముంపు బాధితులకు న్యాయం చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ఐటీడీఏను ముట్టడించారు. సిపిఎం నాయకులు పులి సంతోష్ కుమార్, కొమరం పెంటయ్య లు మాట్లాడుతూ విఆర్ పురం మండలం రామవరం గ్రామంలోని 104 కుటుంబాలను ముంపులో చేర్చి హౌస్ స్ట్రక్చర్ వాల్యువేషన్ చేసి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
శ్రీరామగిరి గ్రామపంచాయతీలో సాగులో ఉన్న 62 ఎకరాల అసైన్మెంట్ భూములను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని,ఆర్&ఆర్ ప్యాకేజీ ఇవ్వని వారికి ఆర్&ఆర్ ఇవ్వాలని కోరారు.వి ఆర్ పురం మండలంలోని పోలవరం నిర్వాసితులు సాగు చేస్తున్న అన్ని రకాల సాగు భూములకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.
ఈ సమస్యల పరిష్కారం కొరకు ఐటీడీఏ ముందు ధర్నా చేసి ఆర్ అండ్ ఆర్ కమిషనర్ పి ప్రశాంతి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.రామవరం లోని 104 కుటుంబాల సమస్య పరిష్కారం చేస్తామని, గిరిజనులు సాగు చేస్తున్న అసైన్మెంట్, డిపారం, ఆర్ వో ఎఫ్ ఆర్ పట్టా భూములకు పూర్తి స్థాయిలో విచారణ చేసి నష్టపరిహారం ఇస్తామని కమిషనర్ ప్రశాంతి ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. దీంతో నిరసనకారులు ధర్నా విరమించారు.




