Velairpadu: నిత్యావసర ధరలు తగ్గించండి: వేలేరుపాడులో సీపీఐ నిరసన!

Velairpadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 9 Sept 2026 6:50 PM IST
Velairpadu
X

Velairpadu: నిత్యావసర ధరలు తగ్గించండి: వేలేరుపాడులో సీపీఐ నిరసన!

వేలేరుపాడు: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం వేలేరుపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ పప్పులు, పంచదార, చింతపండు, వంట నూనెలు, బియ్యం తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చౌకధరల దుకాణాల ద్వారా కేవలం బియ్యం, పంచదారకే పరిమితం కాకుండా 16 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఎన్నికల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ధరల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ సురేంద్రకుమార్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బాడిశ రాము, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టా ప్రసాద్, నాయకులు పిట్టా వీరయ్య, బంధం అర్జున్, బంధం నాగేశ్వరరావు, కరటం వెంకటేశ్వరరావు, కురిమల వెంకటేశ్వర్లు, బుడిబుడి జాన్‌బాబు, పండ హుస్సేన్, పెడకం వెంకటేశ్వరరావు, సోడే ప్రసాద్, మచ్చ చందర్రావు, తెల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story