Kukunoor: డ్వాక్రా యానిమేటర్లకు అదనపు పనులు అప్పగించొద్దు: సీఐటీయూ!

Kukunoor: అక్షరాంధ్ర కార్యక్రమంలో డ్వాక్రా యానిమేటర్లకు సంబంధం లేని పనులు అప్పగించవద్దని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ డిమాండ్ చేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 17 Aug 2026 5:01 PM IST
Kukunoor
X

Kukunoor: డ్వాక్రా యానిమేటర్లకు అదనపు పనులు అప్పగించొద్దు: సీఐటీయూ!

కుక్కునూరు: అక్షరాంధ్ర కార్యక్రమంలో డ్వాక్రా యానిమేటర్లకు సంబంధం లేని పనులు అప్పగించకుండా, అధికారిక లాగిన్‌కు సంబంధించిన పనులను సంబంధిత సచివాలయ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్‌ డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో యానిమేటర్లు సోమవారం కుక్కునూరు ఎంపీడీవో నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యర్నం సాయికిరణ్‌ మాట్లాడుతూ, అక్షరాంధ్ర కార్యక్రమంలో నిరక్షరాస్యులను గుర్తించడం, వివరాలను యాప్‌లో నమోదు చేయడం, అక్షరాస్యతపై శిక్షణ, పరీక్షలు నిర్వహించడం వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు.

అయితే యాప్‌కు సంబంధించిన అధికారిక లాగిన్లు సచివాలయ సిబ్బందికి ఉన్నప్పటికీ, ఆ పనులను డ్వాక్రా యానిమేటర్లతో చేయించడం సరికాదన్నారు. ఇప్పటికే యానిమేటర్లు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన విధులు నిర్వహిస్తున్నారని, అదనంగా సంబంధం లేని పనులు అప్పగించడం వల్ల వారిపై పనిభారం పెరుగుతోందని తెలిపారు.

అక్షరాంధ్ర యాప్‌లో డేటా నమోదు, ధృవీకరణ తదితర అధికారిక పనులను సంబంధిత సచివాలయ సిబ్బందితోనే నిర్వహించాలని, యానిమేటర్లకు వారి విధులకు సంబంధం లేని పనులు అప్పగించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఎంపీడీవోను కోరారు. సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో నాగరాజు హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో యాణిమేటర్లు మెడవరపు రమాదేవి, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story