Chintoor: చింతూరు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో తీవ్ర మౌలిక వసతుల లేమి!
Chintoor: చింతూరు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు. బాత్‌రూమ్స్ మరమ్మతులకు గురై మహిళల అవస్థలు.. పట్టించుకోని అధికారులు.
Chintoor: చింతూరు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో తీవ్ర మౌలిక వసతుల లేమి!
Chintoor: చింతూరు లోని ఆర్ టి సి బస్ కాంప్లెక్స్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు.బస్సు కాంప్లెక్స్ లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బాత్రూమ్స్ మరమ్మత్తులకు గురై మురికి కూపంగా తయారవడంతో మహిళలు కాలకృత్యాలు కోసం సిగ్గు విడిచి బహిరంగ ప్రదేశాల్లోనే కాలకృత్యాలకు వెళుతూ పడరాని పాట్లు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
బస్సు కాంప్లెక్స్ లో కాలకృత్యాలు కోసం మహిళలు పడుతున్న అవస్థలను చూసి పలువురు చలించిపోతున్నారు. డివిజన్ కేంద్రంలోని బస్ కాంప్లెక్స్ లో మహిళలు ఇంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం పట్ల మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఆర్టీసీ అధికారుల భార్యా పిల్లలు కుటుంబ సభ్యులు ఎదుర్కొంటే తప్ప ఆర్టీసీ అధికారులలో చలనం వచ్చి బాత్రూమ్స్ వినియోగం లోకి వచ్చేలా కృషి చేస్తారేమో అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
నిత్యం చింతూరు బస్ కాంప్లెక్స్ నుంచి పదుల సంఖ్యలో బస్సులు తిరుగుతూ ఉంటాయి. చాలామంది ప్రయాణికులు బస్సు కాంప్లెక్స్ కు వచ్చి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాంప్లెక్స్ లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం పట్ల పలువురు ఆర్టీసీ అధికారుల తీరు పై మండిపడుతున్నారు.అసలు బస్సు కాంప్లెక్స్ నిర్వహణని గాలికి వదిలేసారని దుయ్యబట్టారు.ఒక్కసారి ఆర్టీసీ అధికారులు చింతూరులోని బస్ కాంప్లెక్స్ ను సందర్శిస్తే ప్రయాణికులు పడుతున్న పాట్లు అర్థమవుతాయని ప్రయాణికులు చెబుతున్నారు.ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు మేలుకోవాలని పలువురు సూచిస్తున్నారు.




