Chintoor: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ - ఈఈ అచ్యుత చారి

Chintoor: చింతూరులో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్. ఏపీఈపీడీసీఎల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఈఈ అచ్యుత చారి సూచన.

RAJESH REDDY, CHINTOOR
Published on: 12 Sept 2026 4:09 PM IST
Chintoor
X

Chintoor: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ - ఈఈ అచ్యుత చారి

చింతూరు: వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయబడే వినాయక మండపాలకు APEPDCL ద్వారా ఉచిత విద్యుత్ సరఫరా కల్పించబడుతుందని రంపచోడవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.అచ్యుత చారి తెలిపారు.ఉచిత విద్యుత్ సౌకర్యం పొందదలచిన వినాయక మండప నిర్వాహకులు APEPDCL Eastern Power వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవలెను అన్నారు.

నిబంధనలు,భద్రతా ప్రమాణాలు మరియు శాఖ మార్గదర్శకాలు పాటించిన అర్హత మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అందించబడుతుంది అన్నారు.మండప నిర్వాహకులు తాత్కాలిక వైరింగ్,విద్యుత్ పరికరాల ఏర్పాటు సమయంలో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి అని తెలిపారు.విద్యుత్ స్తంభాలు,తీగలు మరియు ట్రాన్స్‌ఫార్మర్లకు సురక్షిత దూరం పాటించాలి అన్నారు.

అనధికారిక కనెక్షన్లు తీసుకోవడం చట్టరీత్యా శిక్షార్హం అని తెలిపారు.విద్యుత్ సంబంధిత సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తిన యెడల వెంటనే సమీప విద్యుత్ కార్యాలయాన్ని లేదా APEPDCL సిబ్బందిని సంప్రదించలని అన్నారు.ప్రజల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించబడాలని APEPDCL కోరుకుంటున్నట్లు తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR