Chintalapudi: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు క్లీనర్ మృతి!

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. క్లీనర్ మృతి, 26 మందికి గాయాలు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 12 Sept 2026 11:44 AM IST
Chintalapudi
X

Chintalapudi: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు క్లీనర్ మృతి!

Chintalapudi: ఏలూరు జిల్లా లో గ్రీన్ ఫీల్డ్ హైవే పై తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపూడి మండలం యండపల్లి లో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పై ఆగి ఉన్న లారీని ప్రయివేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు వెనుక నుండి డీ కొట్టింది.

ఈ ఘటనలో బస్సు క్లినర్ చీపురుపల్లి సంతోష్ కుమార్ (26)మృతిచెందాడు.మరో 26 మందికి గాయాలు అయ్యాయి. జగన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైద్రాబాద్ నుండి విజయనగరం వెళుతుంది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు వున్నారు.

మొత్తం 26 మందికి గాయాలు కాగా 17 మంది క్షతగాత్రులను చింతలపూడి ఆసుపత్రికి తరలించారు. మరో 9 మంది సత్తుపల్లి ఆసుపత్రి కి తరలించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రమాద ఘటనలో చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ క్షతగాత్రులకు సత్వర సేవలు అందించారు.

పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడంపై స్థానికులు అభినందించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI