Kukkunuru: 50 ఏళ్లుగా రోడ్డు కష్టాలు: ఎమ్మెల్యే బాలరాజుకు గిరిజనుల వినతి!
Kukkunuru: కుక్కునూరు మండలం బూర్గువాయి గ్రామ గిరిజనులు 50 ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వినతిపత్రం అందజేశారు.
Kukkunuru: 50 ఏళ్లుగా రోడ్డు కష్టాలు: ఎమ్మెల్యే బాలరాజుకు గిరిజనుల వినతి!
కుక్కునూరు: మండలం పెదరాయిగూడెం పంచాయతీ పరిధిలోని బూర్గువాయి గ్రామ గిరిజనులు దాదాపు 50 ఏళ్లుగా సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలేరు ప్రధాన రహదారికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం గ్రామంలోకి చేరలేని పరిస్థితి నెలకొంది.
గ్రామానికి వెళ్లే దారి పూర్తిగా గుంతలమయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా రహదారి మొత్తం బురదమయమై, నడిచి వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, గర్భిణులను, వృద్ధులను ఆసుపత్రులకు తరలించేందుకు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఈ సమస్యను పరిష్కరించి బూర్గువాయి గ్రామానికి పక్కా రహదారి నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు బరింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కుక్కునూరు మండల అధ్యక్షులు కె. వి. ఎన్ దొర, వేలేరుపాడు జనసేన ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్, శివరామ్, బుర్గువాయి గ్రామస్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




