Yetapaka: ఎటపాక మండలంలో 7 మినీ గోకులాలు మంజూరు!
Yetapaka: పోలవరం జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం పరిధిలోని పాలమడుగులో మినీ గోకులం పశువుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.
Yetapaka: ఎటపాక మండలంలో 7 మినీ గోకులాలు మంజూరు!
ఎటపాక: పశుపోషకులను ప్రోత్సహించడంతో పాటు పశువులకు మెరుగైన వసతి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం మినీ గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎటపాక మండలంలో ఏడు మినీ గోకులాలు మంజూరు చేయడం జరిగింది. లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని పాలమడుగు గ్రామంలో పశువుల షెడ్డు నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఎటపాక మండల వ్యాప్తంగా మొత్తం ఏడు మినీ గోకులాలు (పశువుల షెడ్లు) మంజూరైనట్లు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కణితి మధు తెలిపారు. ఇందులో భాగంగా పాలమడుగు గ్రామంలో నిర్మించనున్న షెడ్డు పనులకు భూమిపూజ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
పశువులను పెంచుతున్న రైతులకు మినీ గోకులాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కణితి మధు అన్నారు.పశువులను వర్షాలు,ఎండల నుంచి రక్షించడంతో పాటు వాటి సంరక్షణకు ఈ షెడ్లు దోహదపడతాయని తెలిపారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణకు ప్రోత్సాహం అందిస్తూ మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ లక్ష్మీపురం పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉండేటి రమేష్,పర్షిక రాంబాబు,కురసం రమేష్, కురసం కన్నయ్య,కురసం రామలక్ష్మి,ఉపాధి హామీ సిబ్బంది టీఏ కణితి రాజు తదితరులు పాల్గొన్నారు.




