Bhimadole: సూరప్పగూడెంలో రాజముద్ర పాస్‌పుస్తకాల పంపిణీ
Bhimadole: భీమడోలు మండలం సూరప్పగూడెంలో రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు.
Bhimadole: సూరప్పగూడెంలో రాజముద్ర పాస్‌పుస్తకాల పంపిణీ
భీమడోలు:రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసుపుస్తకాల చట్టం – 1971 ప్రకారం రీసర్వే పూర్తైన గ్రామాల్లో రాజకీయ పార్టీ చిహ్నాలు, పేర్లు తొలగించి ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వం జారీ చేస్తోంది.
ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో రైతులకు మంజూరైన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను బుధవారం ఉదయం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఫోటోను పట్టాదారు పాస్ పుస్తకాలపై ముద్రించి, ప్రజల ఆస్తిని తన వ్యక్తిగత ఆస్తిలా భావించిన తీరు రైతులను, ప్రజలను తీవ్రంగా బాధించింది. అందుకే రైతులే తిరగబడ్డారాన్నారు.
గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే, అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఈరోజు నెరవేర్చింది. ఇది రైతుల పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భీమడోలు మండలం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, తహసీల్దార్, సూరప్పగూడెం గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రెవిన్యూ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




