Kukunoor: కుక్కునూరులో ఇనుప ఖనిజం అక్రమ రవాణా యత్నం!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఉప్పేరు పంచాయతీ బల్లగుట్ట అటవీ ప్రాంతం నుంచి ఇనుప ఖనిజం అక్రమ రవాణాకు యత్నించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 3 Aug 2026 8:54 AM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరులో ఇనుప ఖనిజం అక్రమ రవాణా యత్నం!

Kukunoor: ఇనుప ఖనిజం తరలింపుకు అక్రమార్కుల యత్నం..

# బల్లగుట్టపై కన్నేసిన అక్రమార్కులు

# గుట్టుచప్పుడు కాకుండా గుట్ట నుంచి అక్రమ రవాణా

# విశాఖపట్నం తరలించేందుకు సన్నాహాలు

# చోద్యంచూస్తున్న అధికారులు

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఉప్పేరు పంచాయతీలో గల రెడ్డిగూడెం గ్రామ సమీపంలోని బల్లగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలపై మళ్లీ అక్రమార్కులు కన్ను పడింది.ఈ ప్రాంతంలోని రిజర్వు,రెవెన్యూ భూముల్లో వందల ఎకరాల్లో ఇనుప ఖనిజం ఉంది. గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఖనిజాన్ని తరలింపుకు కర్నాటక ప్రాంతానికి చెందిన కొందరు అక్రమార్కులు సన్నాహాలు జరిగాయి. కాగా అప్పుడు స్థానిక గిరిజనులు, ఆదివాసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుడంతో ఖనిజం అక్రమ రవాణా నిలిచింది.

సుమారు 12 ఏళ్ల తరువాత మళ్ళీ ఇక్కడి ఇనుప ఖనిజంపై విశాఖపట్నం కు చెందిన కొందరు కేటుగాళ్ల కన్ను పడింది. రెండు నెలల నుంచి అక్రమార్కులు కుక్కునూరు మండల పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టి మరీ ఖనిజాన్ని తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. కాగా 3 రోజుల క్రితం బల్లగుట్ట ప్రాంతం నుంచి ట్రాక్టర్ ల్లో ఇనుప ఖనిజాన్ని రెడ్డిగూడెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న జామాయిల్ తోటల వద్ద భారీగా నిల్వ చేశారు. కాగా కాస్త విషయం బయటకు రావడం,లారీ బురదలో నిలిచి మార్గం లేక అవస్థలు పడటంతో లారీని తీసుకొని అక్రమార్కులు ఉడాయించారు.

ఇక్కడ ఉన్న ఇనుప ఖనిజానికి ఉక్కులో ఉండే ఉష్ణోగ్రత కంటే 20 శాతం అధిక ఉష్ణోగ్రత ఉన్నట్టు అప్పుడు చెన్నై కి చెందిన ఇందిరాగాంధీ నేషనల్ రీసెర్చ్ కి చెందిన శాస్త్రవేత్తలు నిర్ధారించారు.ఈ ఖనిజాన్ని అణు విద్యుత్ తయారీలో కీలకంగా వాడనున్నట్టు శాస్త్రవేత్తలు అప్పడు వివరించారు.దేశంలోనే కర్ణాటక తరహాలో లభ్యమయ్యే ఇనుప ఖనిజం తరహాలో పోలి ఉండే ఖనిజం కుక్కునూరు అడవుల్లో ఉన్నట్టు అప్పట్లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు.

బల్లగుట్ట అడువుల్లో ఉన్న ఇనుప ఖనిజంపై మళ్లీ అక్రమార్కులు తరలింపుకు పథకం పన్నిన్నా..విషయం దావనంలా వ్యాపించినా స్థానిక అధికారులు చోద్యంచూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇనుప ఖనిజం అక్రమ వ్యవహారం పై తెలుగుదేశం పార్టీ కుక్కునూరు మండల అధ్యక్షుడు ములిశెట్టి. నాగేశ్వరరావు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి ఫొన్ లో వివరించారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story