Chintoor: విలీన మండలాల్లో అరకు ఎంపీ తనుజారాణి పర్యటన!

Chintoor: ఈ నెల 12, 13 తేదీల్లో విలీన మండలాల్లో అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి పర్యటన. పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రణాళిక.

RAJESH REDDY, CHINTOOR
Published on: 11 Sept 2026 10:25 AM IST
Chintoor
X

Chintoor: విలీన మండలాల్లో అరకు ఎంపీ తనుజారాణి పర్యటన!

Chintoor: పోలవరం ప్రాజెక్టు వలన ఆంధ్రాలో విలీనమైన చింతూరు కూనవరం వీఆర్పురం ఎటపాక మండలాల్లో ఈ నెల 12, 13 తేదీలలో అరకు పార్లమెంటు సభ్యురాలు గుమ్మ తనుజారాణి పర్యటించనున్నట్లు చింతూరు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ రామలింగారెడ్డి తెలిపారు. ఎంపీ పర్యటన ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులవుతున్న నిర్వాసితులతో సమావేశం అయ్యి వారి సమస్యలను,బాధలను అడిగి తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలుస్తుంది.

నిర్వాసితులకు పరిహారం పునరావాసం పై జరుగుతున్న హెచ్చుతగ్గులు, అన్యాయాల పై ఆరా తీసి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.విలీన మండలాల్లో ప్రతి ఏడాది గోదావరి శబరి వరదల వలన నిర్వాసితులు నానా కష్టాలు పడుతూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తదుపరి విలీన మండలాల్లో మండలాల వారిగా వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై పార్టీ అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. నిర్వాసితులకు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు అండగా ఉండేలా ఎంపీ తనుజారాణి దిశా నిర్దేశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story