Chintoor: ఎంపీ తనుజారాణి పర్యటనను విజయవంతం చేయండి వైఎస్సార్‌సీపీ నాయకులు!
Chintoor: అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి విలీన మండలాల పర్యటన. 13న చింతూరు కుమ్మూరులో ఎంపీకి పోలవరం నిర్వాసితుల సమస్యలు విన్నవించనున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
Chintoor: ఎంపీ తనుజారాణి పర్యటనను విజయవంతం చేయండి వైఎస్సార్‌సీపీ నాయకులు!
Chintoor: అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనుజారాణి నేడు, రేపు విలీన మండలాల్లో పర్యటిస్తున్నారు. 13వ తేదీన చింతూరు మండలంలోని కుమ్మూరు గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎంపీ తనుజారాణి పర్యటించనున్నారు.
ఎంపీ తనుజారాణి పర్యటన సందర్భంగా చింతూరు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ రామలింగారెడ్డి, జడ్పిటిసి మురళి ముఖ్య నాయకులు కుమ్మూరు గ్రామంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎంపీ తనుజారాణి పర్యటనను విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తనుజారాణి పర్యటనలో వైసిపి నాయకులు కార్యకర్తలు మండలంలో నెలకొని ఉన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు వలన ముంపునకు గురవుతున్న నిర్వాసితుల గోడును, వారికి జరుగుతున్న అన్యాయాలు ఎంపీ తనుజారాణి కి తెలియజేయనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ (చిన్ని),సర్పంచ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.




