Chintoor: ఎంపీ తనూజారాణి హామీతో పోలవరం బాధితుల్లో ఆశల కిరణాలు!

Chintoor: చింతూరు ముంపు మండలాల్లో అరకు ఎంపీ తనూజారాణి పర్యటన. పోలవరం నిర్వాసితుల సమస్యలను శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని హామీ.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 15 Sept 2026 10:15 AM IST
Chintoor
X

Chintoor: ఎంపీ తనూజారాణి హామీతో పోలవరం బాధితుల్లో ఆశల కిరణాలు!

Chintoor: పోలవరం జిల్లా విలీన మండలాల్లోని నిర్వాసితులలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అరకు ఎంపీ తనుజారాణి ముంపు గ్రామాలలో పర్యటించి నిర్వాసితుల సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని శీతాకాల సమావేశంలో పార్లమెంట్ లో ప్రస్తావిస్తాను అని నిర్వాసితులకు హామీ ఇవ్వడంతో నిర్వాసితుల్లో కొత్త ఆశలు చిగురించాయి. నిర్వాసితు లు తమ గ్రామాలు 45 కాంటూరులో ఉన్నాయని కానీ చిన్నపాటి వరద వస్తే తమ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని కావున తమ గ్రామాలను 41.15 కాంటూరు లో కలపాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించుకున్న చూద్దాం చేద్దాం అని చెబుతున్నారే తప్ప తమకు న్యాయం చేయట్లేదని పలువురు నిర్వాసితులు ఎంపీ తనుజారాణి ఎదుట వాపోయారు.

అలాగే కటాఫ్ డేటుకు సంబంధం లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పరిహారం, పునావాసం కల్పించేలా చేయాలని నిర్వాసితులు ఎంపీ తనుజారాణి ఎదుట విన్నవించుకున్నారు. ఎంపీ తనుజారాణి ముంపు మండలాల్లో రెండు రోజులు పర్యటించి నిర్వాసితుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. శీతాకాల సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను వారికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని నిర్వాసితులకు ఎంపీ తనూజరాణి హామీ ఇవ్వడం జరిగింది. నిర్వాసితులకు ఎంపీ తనుజరాని హామీ ఇవ్వడంతో కాస్త వారిలో ఆశలు చిగురించాయి.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR