Chintoor: పార్లమెంట్‌లో పోలవరం నిర్వాసితుల సమస్యలపై పోరాడతా: ఎంపీ!
Chintoor: పోలవరం నిర్వాసితుల సమస్యలపై పార్లమెంట్‌లో పోరాడతానని అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి స్పష్టం చేశారు.
Chintoor: పార్లమెంట్‌లో పోలవరం నిర్వాసితుల సమస్యలపై పోరాడతా: ఎంపీ!
చింతూరు: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనుజారాణి పర్యటించారు.ఆదివారం విఆర్ పురం, చింతూరు మండలాలలో ముంపునకు గురవుతున్న గ్రామాలలో పర్యటించి నిర్వాసితులతో ముచ్చటించారు. కుమ్మూరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ తనుజారాణి మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులు ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేందుకు తమ జీవితాలను ఫణంగా పెట్టిన త్యాగదనులని కొనియాడారు.
అటువంటి నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నానని వాటిని పార్లమెంట్ లో మాట్లాడి పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పోలవరం ప్రాజెక్టు వలన కొన్ని గ్రామాలు 41.15 కాంటూరు లో ముంపునకు గురవుతున్నప్పటికీ అధికారుల మాత్రం 45 కాంటూరులో అ గ్రామాలను చేర్చడం పట్ల ఎంపీ తనుజారాణి విష్మయం వ్యక్తం చేశారు.కట్ ఆఫ్ డేట్ కి ఒక్కరోజు తక్కువైన 18 సంవత్సరాల యువతకు పరిహారం పునరావాసం అందించకపోవడం బాధాకరమని అన్నారు.
పలువురు పోలవరం అధికారులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వింటు నిర్వాసితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.భవిష్యత్తులో ఆ అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీ తనుజారాణి హెచ్చరించారు. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని నిర్వాసితులకు ఎంపీ తనుజారాణి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి,చింతూరు మండల వైఎస్సార్సీపి కన్వీనర్ రామలింగారెడ్డి, జడ్పిటిసి మురళి, ఎంపీపీ అమల,వైస్ ఎంపీపీ సుధాకర్ (చిన్ని), కోట్ల కృష్ణ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.




