Kukunoor: కుక్కునూరు తహశీల్దార్‌కు వ్యవసాయ కార్మిక సంఘం వినతిపత్రం!
Kukunoor: మార్పు రావాలి మార్పు కావాలని కోరుతూ కుక్కునూరు తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు.
Kukunoor: కుక్కునూరు తహశీల్దార్‌కు వ్యవసాయ కార్మిక సంఘం వినతిపత్రం!
Kukunoor: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మార్పు రావాలి మార్పు కావాలని కోరుతూ వ్యవసాయ కార్మిక కుక్కునూరు మండల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కుక్కునూరు తహసిల్దార్ చలపతిరావుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం కుక్కునూరు మండల కార్యదర్శి కూరాకుల బాబురావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని,రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పేదల వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పేదలకు సామాజిక న్యాయం,ఆత్మగౌరవం కల్పించాలని ఆర్థిక,రాజకీయ రంగాల్లో కూడా పేదలకు స్థానం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె .లక్ష్మయ్య, భీమయ్య, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.




