Chintoor: ఎటపాకలో భారీగా జనసేన పార్టీలోకి గిరిజనుల చేరికలు!

Chintoor: ఎటపాక మండలం ఎర్రగట్టు కాలువ గ్రామానికి చెందిన 50 మంది గిరిజనులు జనసేన పార్టీలో చేరారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 13 Sept 2026 10:14 PM IST
Chintoor
X

Chintoor: ఎటపాకలో భారీగా జనసేన పార్టీలోకి గిరిజనుల చేరికలు!

Chintoor: పవన్ కళ్యాణ్ ఆశయాల వైపు గిరిజనులు అడుగులు వేస్తున్నారు.జనసేన పార్టీలో చేరి తమ మద్దతును గిరిజనులు ప్రకటిస్తున్నారు.ఎటపాక మండలం చోడవరం పంచాయతీ ఎర్రగట్టు కాలువ కు చెందిన 50 మంది సీనియర్ నాయకులు గోడేటి నాగరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి గిరిజనులు జనసేన పార్టీలో చేరుతున్నారని అన్నారు.

జనసేన మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో జనసేనలోకి మరిన్ని భారీ చేరికలు ఉంటాయని అన్నారు.ఎర్రగట్టు కాలువలో నెలకొని ఉన్న రహదారి, కరెంటు,మంచినీటి,కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మొల.సతీష్, గ్రామ పెద్దలు మడకం దేవా, గ్రామస్తులు మడకం జోగారావు, కోపం ముతేష్, కోరం దేవయ్య, నూపదేవా, ముచ్చుకి జోగయ్య, ముచ్చికి ముఖేష్, కోరం చుక్కయ్య, పోడియం పోజ్జా, మడివి రాజు, మడకం చిన్న జాగా, సోడి కన్నయ్య, కోరం భద్రయ్య, కోవైసీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR