Nuzvid: వెంకటాద్రిపురంలో ఘనంగా 24వ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు!
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో 24వ వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 అడుగుల మట్టి విగ్రహంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Nuzvid: వెంకటాద్రిపురంలో ఘనంగా 24వ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు!
Nuzvid: నూజివీడు మండలం అన్నవరం శివారు వెంకటాద్రి పురం గ్రామంలో 24 వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఐదు అడుగుల మట్టి విగ్రహంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులు.
గ్రామంలోని భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనాలు పొంది అక్షంతలు స్వీకరించారు.ఈరోజు వినాయక చవితి సందర్భంగా స్వామివారిని పూజించి అక్షంతలు నెత్తిపై వేసుకున్న యడల ఎటువంటి నీలాప నిందలు రావని భక్తుల ప్రగాఢ నమ్మకం.




