Viral News: ఇంటర్ పేపర్‌లో సెంటిమెంట్ సీన్.. ఎగ్జామినర్‌కే దిమ్మతిరిగేలా విద్యార్థి లేఖ!

Viral News: పరీక్షల సమయంలో చదువు పక్కన పెట్టి సోషల్ మీడియా, రీల్స్‌తో కాలక్షేపం చేసే విద్యార్థులు.. తీరా రిజల్ట్స్ భయంతో ఎలాంటి విన్యాసాలు చేస్తారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.

Arun Chilukuri
Published on: 31 March 2026 5:40 PM IST
Viral News: ఇంటర్ పేపర్‌లో సెంటిమెంట్ సీన్.. ఎగ్జామినర్‌కే దిమ్మతిరిగేలా విద్యార్థి లేఖ!
X

Viral News: పరీక్షల సమయంలో చదువు పక్కన పెట్టి సోషల్ మీడియా, రీల్స్‌తో కాలక్షేపం చేసే విద్యార్థులు.. తీరా రిజల్ట్స్ భయంతో ఎలాంటి విన్యాసాలు చేస్తారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. తెలంగాణలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం (Valuation) జరుగుతుండగా, ఒక విద్యార్థి రాసిన సమాధానం చూసి ఎగ్జామినర్లు అవాక్కయ్యారు.

నువ్వే నా దేవుడు.. పాస్ చేయి సార్!

సాధారణంగా కొందరు విద్యార్థులు పాస్ చేయమని ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టడం లేదా సినిమా కథలు రాయడం చూస్తుంటాం. కానీ, ఈ 'ఆణిముత్యం' మాత్రం ఒక అడుగు ముందుకు వేసి తనలోని డ్రాయింగ్ టాలెంట్‌ను బయటపెట్టాడు. సదరు విద్యార్థి ఆన్సర్ షీట్‌లో ఇలా రాశాడు: "సార్.. నాకు అమ్మానాన్న లేరు. మీరే నాకు అమ్మానాన్న. నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి."

స్క్రీన్ ప్లే అదిరింది:

కేవలం రాతతోనే ఆగకుండా, ఒక గురువు కాళ్లపై శిష్యుడు పడి నమస్కరిస్తున్నట్లుగా ఒక బొమ్మ కూడా గీశాడు. గురువు బొమ్మ పక్కన 'సార్' అని, కాళ్లపై పడ్డ బొమ్మ పక్కన 'నేను' అని లేబుల్స్ కూడా ఇచ్చాడు. ఈ వింత 'సమాధానం' ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

నెటిజన్ల సెటైర్లు:

ఈ ఫొటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "వీడు పాసైనా ఫెయిలైనా జబర్దస్త్ లాంటి షోలకు వెళ్తే పక్కా ఫేమస్ అవుతాడు" అని ఒకరు కామెంట్ చేయగా, "ఎంతకు తెగించార్రా బాబు" అని మరికొందరు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. పరీక్షల్లో మార్కులు పడాలంటే చదువుకోవాలే కానీ, ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు పనిచేయవని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఈ విద్యార్థి క్రియేటివిటీ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story