TG TET Results 2026: నేడే టీజీ టెట్ ఫలితాల విడుదల.. లింక్ ఇదే!

TG TET Results 2026: తెలంగాణ టెట్ (TG TET 2026) జూన్ సెషన్ ఫలితాలు నేడు (జులై 13) విడుదల కానున్నాయి.

Arun Chilukuri
Published on: 13 July 2026 10:43 AM IST
TG TET Results 2026
X

TG TET Results 2026: నేడే టీజీ టెట్ ఫలితాల విడుదల.. లింక్ ఇదే!

TG TET Results 2026: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET - జూన్ 2026) ఆన్‌లైన్ పరీక్షల ఫలితాలు నేడు (సోమవారం, జులై 13) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?

మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్‌పేజీలో అందుబాటులో ఉండే 'TG TET June - 2026 Results' లింక్‌పై క్లిక్ చేయండి.

మీ రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయండి.

'Submit' బటన్‌పై క్లిక్ చేయగానే మీ టెట్ మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ మార్కుల మెమోను ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షల వివరాలు మరియు అభ్యర్థుల సంఖ్య

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 16 నుండి జూన్ 22 వరకు మొత్తం 10 సెషన్లలో ఆన్‌లైన్ (CBT) విధానంలో ఈ టెట్ పరీక్షలను నిర్వహించారు.

మొత్తం దరఖాస్తుదారులు: 1,53,752 మంది

పేపర్-1 (1 నుండి 5 తరగతులు): 50,113 మంది

పేపర్-2 (6 నుండి 8 తరగతులు): 1,03,639 మంది

DSC నియామకాల్లో 20% వెయిటేజీ.. లైఫ్‌టైమ్ వాలిడిటీ!

ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు టెట్ మార్కులు అత్యంత కీలకం. ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఇందులో మంచి స్కోర్ సాధించడం ఉద్యోగ సాధనలో ప్లస్ పాయింట్ అవుతుంది. అంతేకాకుండా, ఒకసారి టెట్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్‌కు లైఫ్‌టైమ్ (జీవితకాల) చెల్లుబాటు ఉంటుంది.

కేటగిరీల వారీగా క్వాలిఫైయింగ్ మార్కులు

టెట్ పరీక్షలో అర్హత సాధించడానికి కేటగిరీల వారీగా కట్-ఆఫ్ మార్కులను నిర్ణయించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో అంటే 90 మార్కులు సాధిస్తే అర్హత పొందుతారు. అలాగే, బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో (75 మార్కులు), ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు 40 శాతం మార్కులతో (60 మార్కులు) పరీక్షలో క్వాలిఫై కావచ్చు.

ఇన్-సర్వీస్ టీచర్లకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్!

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. రాష్ట్రంలో 2011 సంవత్సరం కంటే ముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి, ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 నాటికి తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ గడువు లోపు క్వాలిఫై కాకపోతే, సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ రద్దు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలో ఈ టెట్ పరీక్షలు రాశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story