TG TET Admit Card 2026: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల..డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్, పరీక్ష తేదీల పూర్తి వివరాలు ఇవే!
TG TET Admit Card 2026 Out: తెలంగాణ ఇన్-సర్వీస్ టీచర్ల టెట్ 2026 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్, పరీక్ష తేదీల పూర్తి వివరాలు ఇవే!
TG TET Admit Card 2026: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల..డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్, పరీక్ష తేదీల పూర్తి వివరాలు ఇవే
TG TET Admit Card 2026: తెలంగాణ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ బిగ్ అప్‌డేట్ అందించింది. రాష్ట్రంలోని ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న 'తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్' (TG TET 2026) అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ అధికారిక పోర్టల్ ద్వారా తమ హాల్‌టికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం.. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలలతో పాటు టీజీఆర్‌ఈఐఎస్ (TGREIS), సంక్షేమ గురుకులాలు మరియు మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 11, 2026 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి ఆన్‌లైన్ (CBT) పద్ధతిలో పేపర్-1, పేపర్-2 విభాగాలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ ప్రింట్‌అవుట్ తప్పనిసరి అని, అడ్మిట్ కార్డ్ లేని అభ్యర్థులను లోపలికి అనుమతించబోరని విద్యాశాఖ స్పష్టం చేసింది.
హాల్‌టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ను సందర్శించాలి. హోమ్‌పేజీలోని 'TG TET In-Service Teachers Admit Card 2026' లింక్‌పై క్లిక్ చేసి, తమ ఆధార్ నంబర్, జర్నల్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేయగానే హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దానిని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ)ను పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.




